అన‌సూయ‌, రోజాల‌ వస్త్రాధారణపై కోటా ఘాటు వ్యాఖ్య‌లు..నెట్టింట వైర‌ల్!

బుల్లితెర హాట్ యాంక‌ర్ అనసూయ వస్త్రాధారణపై ఎప్పుడూ ఎవ‌రో ఒక‌రు విమ‌ర్శ‌లు కురిపిస్తూనే ఉంటారు. పెళ్లై ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నా అన‌సూయ చిట్టి పొట్టి బ‌ట్ట‌ల‌తో అందాలు ఆర‌బోస్తుంటుంది. ముఖ్యంగా ప్ర‌ముఖ కామెడీ షో జ‌బ‌ర్థ‌స్త్‌లో అన‌సూయ క్లీవేజ్ షో ఓ రేంజ్‌లో ఉంటుంది.

Anasuya Bharadwaj Ultra hot photos 2019 - South Indian Actress - Photos and Videos of beautiful actress -

ఈ విష‌యంలో అన‌సూయ‌ను నెటిజ‌న్లు ఎన్ని ర‌కాలుగా ట్రోల్ చేసినా.. ఆమె మాత్రం అస్స‌లు ప‌ట్టించుకోలేదు. కానీ, ఈ సారి ఏకంగా టాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు కోట శ్రీనివాసరావే అన‌సూయ వ‌స్త్రాధార‌ణ‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న కోటా.. ఎన్నో విష‌యాల‌ను పంచుకున్నారు. అయితే ఈ క్ర‌మంలోనే జబర్దస్త్ షోపై మీ అభిప్రాయం ఏంటంటూ కోటా శ్రీనివాసరావును యాంక‌ర్‌ ప్ర‌శ్నించింది.

Called Up Chiru, Pawan, Trivikram For Film Offers: Kota -

అందుకు ఆయ‌న స్పందిస్తూ.. జబర్దస్త్ షో లో ఏదో నాలుగు డైలాగులు.. బట్టలు వేసుకోవడం తప్ప ఇంకేమి ఉండ‌ద‌ని, అలాంటి షోలు ఎల్లకాలం నిల‌వ‌లేవ‌ని చెప్పుకొచ్చారు. అలాగే ఈ షోలో అన‌సూయ‌, రోజాల వ‌స్త్రాధార‌ణ గురించి మాట్లాడుతూ.. అనసూయ ఎంతో అందంగా ఉంటుంది, బాగా న‌టిస్తుంది, మ‌రియు ఆమె ఎలా క‌నిపించినా ప్రేక్ష‌కులు చూస్తారు. అటువంటి ఆమె పొట్టి పొట్టి బ‌ట్ట‌లు వేసుకుని అందాల ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డం ఎందుకూ అంటూ కోటా ప్ర‌శ్నించారు. ఇక జబర్దస్త్ లో రోజా చ‌క్క‌గా రెడీ అవుతుంద‌ని, ఎంతో అందంగా క‌నిపిస్తుంద‌ని.. అయినా ఆ షోను తాను చూడ‌న‌ని కోటా చెప్పుకొచ్చారు. దాంతో ఆయ‌న కామెంట్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

 

 

Share post:

Latest