చైతుదే త‌ప్పు..స‌మంత‌ది కాదు..కంగ‌నా షాకింగ్ కామెంట్స్‌!

టాలీవుడ్ క్యూట్ క‌పుల్ నాగ‌చైత‌న్య‌-స‌మంత విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని ఆ జంట స్వ‌యంగా వెల్ల‌డించారు. దాంతో సామ్‌-చైతు విడాకులపై అభిమానులు, సినీ ప్ర‌ముఖులు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌, కాంట్రవర్సీ క్వీన్‌ కంగనా రనౌత్ వీరి విడాకుల‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేసింది.

Tollywood's dream couple Samantha, Naga Chaitanya announce separation

నాగ‌చైత‌న్య -స‌మంత విడాకుల‌కు కార‌ణం బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ నే, అత‌డి స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకునే సామ్‌కు చైతు విడాకులు ఇచ్చార‌ని ప‌రోక్షంగా పోస్ట్ పెట్టింది. ఇక తాజాగా చైతును టార్గెట్ చేస్తూ మ‌రో ఆస‌క్తిక‌ర పోస్ట్ పెట్టింది. `ఏ జంట విడాకులు తీసుకున్నా.. దానికి మూల కారణం పురుషుడే.

Kangana Ranaut shares lessons from Covid-19 pandemic: 'Don't beg from poor people for funds if you are rich' | Entertainment News,The Indian Express

వినడానికి ఇది ఒక తీర్పులా అనిపించినా.. ఇందులో నిజం లేకపోలేదు. ఎందుకంటే దేవుడు స్త్రీ, పురుషులను అలాగే సృష్టించాడు. విడాకుల సంస్కృతి రోజురోజుకీ బాగా పెరిగిపోతుంది` అంటూ పోస్ట్ పెట్టింది. అంటే విడాకుల విష‌యంలో చైతుదే త‌ప్ప‌ని.. స‌మంత‌ది కాద‌ని కంగ‌నా ప‌రోక్షంగా చెప్పేసింది.