రాఘవేంద్రరావు హీరోగా ప్రేమ క‌థా చిత్రం..డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

కె.రాఘవేంద్రరావు.. ఈయ‌నో గొప్ప డైరెక్ట‌ర్ అని అంద‌రికీ తెలుసు. నలభై ఏళ్ళ సినీ కెరీర్ లో వందకు పైగా చిత్రాలను రూపొందించిన ఈయన.. రొమాంటిక్‌ కామెడీ, ఫాంటసీ, మెలోడ్రామా, యాక్షన్‌ థ్రిల్లర్, జీవిత కథలు…ఇలా ఆయన వెండితెరపై టచ్‌ చేయని అంశం లేద‌నే చెప్పాలి. ఇక గ‌త కొంత కాలంలో సినిమాలు తీయ‌డం త‌గ్గించ‌డంతో.. ఇక రాఘ‌వేంద్ర‌రావు రిటైర్మెంట్ తీసుకుంటారు అని అంద‌రూ అనుకున్నారు.

K. Raghavendra Rao - Wikipedia

కానీ, అలాంటి త‌రుణంలో అనూహ్యంగా ఆయ‌న ద‌ర్శ‌కుడి నుంచి న‌టుడిగా ట‌ర్న్ తీసుకుని అంద‌రికీ షాక్ ఇచ్చారు. ఈయ‌న న‌టిస్తున్న తొలి చిత్రం `పెళ్లి సంద‌D`. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబ‌ర్ 15న విడుద‌ల కానుంది. అలాగే మ‌రోవైపు రాఘవేంద్రరావు ప్ర‌ధాన పాత్ర‌లో తనికెళ్ళ భరణి దర్శకత్వంతో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ మ‌ధ్యే షూటింగ్ కూడా స్టార్ట్ అయింది.

K Raghavendra Rao's multi-starrer

అయితే ఇప్పుడు రాఘవేంద్రరావు హీరోగా మ‌రో చిత్రం తెర‌కెక్క‌బోతోంది. తెలుగులో ఎన్నో హిట్టు సినిమాలు తీసిన వి.ఎన్.ఆదిత్య ఈ మూవీని డైరెక్ట్ చేయ‌నున్నారట‌. ఇదో ప్రేమ క‌థా చిత్ర‌మ‌ట‌. అరవై ఏళ్ల వ్యక్తి ప్రేమ కథ నేప‌థ్యంలోనూ ఈ మూవీ ఉండ‌బోతోంద‌ని..ప్ర‌స్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయ‌ని టాక్ న‌డ‌స్తోంది. అంతేకాదు, త్వ‌ర‌లోనే ఈ మూవీని అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నార‌ట‌.