ఆఫ‌ర్ల కోసం రూటు మార్చిన ఇలియానా..ఏం చేయ‌బోతోందంటే?

గోవా బ్యూటీ ఇలియానా గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `దేవదాసు` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. అలాగే తెలుగులో ఎన్నో హిట్ చిత్రాల‌ను ఖాతాలో వేసుకున్న‌ ఇలియానా.. ఇక్క‌డ కెరీర్ పీక్స్‌లో ఉన్న‌ప్పుడే బాలీవుడ్‌కు మకాం మార్చేసింది.

Ileana D'Cruz: I cherish what I had with Andrew and look back at it with a smile | Hindi Movie News - Times of India

కానీ, అక్క‌డ మాత్రం ఈ హాట్ బ్యూటీ స‌త్తా చాట‌లేక‌పోయింది. బాలీవుడ్ ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ఆమెను ప‌క్క‌న పెట్టేశాడు. ప్ర‌స్తుతం ఇలియానాకు ఆఫ‌ర్ల అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా సంవత్సరానికి మూడు, నాలుగు సినిమాలు చేసిన ఇలియానా ఇప్పుడు ఒక సినిమా అవ‌కాశం రావ‌డ‌మే క‌ష్టంగా మారింది.

Ileana D'Cruz: Getting into uncertain sphere pushes me to do better

ఈ నేప‌థ్యంలోనే రూటు మార్చుకున్న ఇలియానా.. ఇక‌పై లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసేందుకు సిద్ధ‌మ‌వుతుంద‌ని తెలుస్తోంది. అందుకోసం మంచి స్క్రిప్ట్‌లు కోసం చూస్తోందట. ఈ క్రమంలనే ఆమె వద్దుకు ఓ క్రైమ్ థ్రిలర్‌ కథ రాగా దానికి ఇలియానా ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.