శివాజీకి ఆ విషయం చెప్పడానికి భయపడ్డ కమల్ హసన్.. ఏం జరిగిందంటే?

తమిళ దిగ్గజ నటుడు శివాజీ గణేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇతను విలక్షణ నటనకు ప్రతిరూపంగా, ఎంతమంది మహానటులకు స్ఫూర్తిగా నిలిచారు. శివాజీ గణేషన్ 1928 అక్టోబర్ 1 న తమిళనాడులోని విల్లుపురం లో జన్మించాడు. నేడు శివాజీ 93వ జయంతి. ఈ సందర్భంగా విశ్వనటుడు కమల్ హాసన్.. శివాజీ గణేషన్ తో జరిగిన ఒక సంఘటన గుర్తు చేసుకున్నారు. 1992లో విడుదల అయిన దేవర్ మగణ్ తెలుగులో క్షత్రియపుత్రుడు సినిమాలో కమల్ హాసన్,శివాజీ గణేషన్ కలిసి నటించారు.ఈ సినిమాకు భరతన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక ఆసక్తికర సంఘటన జరిగిందట.

ఆ సినిమాలో ఒక సీన్ లో శివాజీ నటన భరతన్ కు నచ్చలేదట. అయితే మళ్లీ ఆ సన్నివేశాన్ని తెరకెక్కించాలని అనుకున్నాడట. ఇక అదే విషయాన్ని డైరెక్ట్ గా శివాజీకి చెప్పలేక కమల్ హాసన్ కు చెప్పారట. కమలహాసన్ కూడా శివాజీ కి ఆ విషయం చెప్పడానికి భయపడ్డాడట. ఇక ఇదే విషయంలో భరతన్, కమల్ హాసన్ మధ్య చర్చ జరిగిందట. వీరిద్దరి చర్చను దూరం నుంచి శివాజీ గమనించారట. దగ్గరకు వచ్చి ఏం జరిగింది అని అడిగాడట? అప్పుడు భరతన్ సైలెంట్గా ఉండి కమలహాసన్ వైపు చూశాడట. అప్పుడు కమలహాసన్ భయపడుతూనే ఈ సీన్ ను ఇంకా బాగా చేయొచ్చు అని శివాజీతో చెప్పాడట. ఇంకా బాగా అంటే ఎలా అని శివాజీ అడగడంతో ఈ సినిమాలో మీ పాత్ర సీనియర్ దేవర్, కానీ మీరు జూనియర్ దేవల నటిస్తున్నారు అని కమల్ హాసన్ అన్నాడట. కమల్ చెబుతున్నది ఏంటో అర్థం చేసుకున్న శివాజీ రెండో టేక్ చేసేందుకు అంగీకరించారట.