`ఆర్ఆర్ఆర్‌` నుంచి లీకైన మ‌రో బిగ్ న్యూస్..?!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన చిత్ర‌మే `ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుధిరం)`. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా క‌ల్పిత క‌థతో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌లో డివివి దానయ్య నిర్మించారు.

Vijayendra Prasad addresses RRR controversies, says SS Rajamouli film 'cannot be compared to Baahubali' | Entertainment News,The Indian Express

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 7న పాన్ ఇండియా లెవ‌ల్‌లో విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ చేశారు. ఇందులో భాగంగా ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్‌ను ఈవెంట్‌ను దుబాయ్‌లో గ్రాండ్‌గా నిర్వ‌హించ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయ‌ని స‌మాచారం.

SS Rajamouli's RRR Movie Gets A New Release Date, Check Details

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మ‌రో బిగ్ న్యూస్ లీకైంది. దాని ప్ర‌కారం.. ఆర్ఆర్ఆర్‌ సినిమా ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్ ని రిలీజ్ చేయటానికి ప్రముఖ హాలీవుడ్ సంస్ద వార్నర్ బ్రదర్శ్ సంస్ద ముందుకు వచ్చిందిట. ఈ విషయమై నిర్మాత దానయ్యతోనూ, రాజమౌళి తోనూ చర్చలు జరుపుతున్నారట. త్వ‌ర‌లోనే దీనిపై ఓ క్లారిటీ వ‌స్తుంద‌ని అంటున్నారు. ఏదేమైనా వార్న‌ర్ బ్ర‌ద‌ర్స్ సంస్థ‌ నిజంగానే ఇంగ్లీష్ వెర్ష‌న్‌ను రిలీజ్ చేస్తే ఆర్ఆర్ఆర్‌కి ఉండే క్రేజే మ‌రో రేంజ్‌కు చేర‌డం ఖాయం.

Share post:

Latest