సొంత తండ్రికే డబ్బులు అప్పుగా ఇచ్చిన హీరోయిన్..ఎవరో తెలుసా?

బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె తండ్రి శతృఘ్న సిన్హా కూడా సినీ ఇండస్ట్రీలో గాయకుడిగా, గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్నో మంచి మంచి సినిమాలకు పాటలను అందించారు. ఈయన ఆస్తి సుమారుగా నూట పది కోట్లకు పైగానే ఉంటుంది. అన్ని కోట్లకు వారసుడైన అతను తన కూతురు సోనాక్షి సిన్హా దగ్గర 16 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నాడట. సొంత కూతురి దగ్గర అప్పు తీసుకోవడం ఏంటి అనుకుంటున్నారా.! పూర్తి వివరాల్లోకి వెళితే..

శతృఘ్న గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున బీహార్లోని పాట్నాలో నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాడు. ఈ నేపథ్యంలోనే తన ఆస్తుల గురించి అలాగే తన కూతురు గురించి పలు వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో ఎంపీ అభ్యర్థిగా పాట్నాలో నామినేషన్ దాఖలు చేసిన అతను అఫిడవిట్ లో తన ఆస్తుల విలువ 112 కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలిపారు. అందులో 103 కోట్లు స్థిరాస్తి, 9 కోట్లు చరాస్తులు ఉన్నాయని, 29 లక్షల షేర్స్ కోటి రూపాయల విలువైన బంగారం ఉన్నట్లు అందులో ప్రకటించారు. అలాగే బ్యాంకు లో రెండు కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా తన కుమార్తెకు పది కోట్లు అప్పు గా ఉన్నట్టు కూడా అందులో తెలియడంతో అందరూ షాక్ కు గురి అయ్యాడు. కొన్నేళ్ళ కిందట తన భార్య కూతురు నుంచి 16 కోట్ల అప్పుగా తీసుకుందని,ఇంకా తన కూతురికి 10 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపారు.

Share post:

Popular