`మా` ఎన్నిక‌ల్లో వారికే నా ఓటు అంటున్న సిద్ధార్థ్‌..!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌(మా) ఎన్నిక‌ల వేడి రోజు రోజుకు భారీగా పెరిగిపోతోంది. పోలింగ్‌కు ఇంకా కొన్ని గంట‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉండ‌గా.. అటు మంచు విష్ణు వ‌ర్గం, ఇటు ప్రకాష్‌రాజ్ వ‌ర్గం అధ్యక్ష పీఠం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

Maa Elections 2021 : 'మా' ఎన్నిక‌ల విష‌యంలో మెగా ఫ్యామిలీ చేతులెత్తేసిందా ? - India Daily Live

మ‌రోవైపు ఈ ఎన్నికలపై ఎవరికివారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హీరో సిద్ధార్థ్ కూడా మా ఎన్నిక‌ల‌పై స్పందించాడు. మా ఎన్నిక‌ల్లో తనకు ఓటు ఉందని, కచ్చితంగా తాను ఓటు వేస్తానని తెలిపారు. ప్రస్తుతం `మా`లో జరుగుతున్న పరిణామాలన్నింటిని గమనిస్తున్నానని తెలిపారు.

MAA elections 2021 Movie Artists Association election results date change:'మా' ఎన్నికల ప్రక్రియలో మార్పు.. తుది ఫలితాలు అప్పుడే | వినోదం News in Telugu

అందరి మాట విని, నా మనసులో ఏమనిపిస్తే వారికే ఓటు వేస్తాను అనిసిద్ధార్థ్ తెలిపారు. ఇక తాను `మా`లో సభ్యుడిని కాబట్టి, తప్పు జరిగితే నిర్మోహమాటంగా ప్రశ్నిస్తానని తెలిపారు. తనకు కోపం ఎక్కువ అని, ఏదైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా అని ఆయ‌న చెప్పుకొచ్చారు.