హీరో అఖిల్.. మొబైల్ లాక్ స్క్రీన్ మీద ఎవరి ఫోటో ఉందో తెలుసా..?

అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్ ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ హీరోగా సక్సెస్ కాలేక పోతున్నాడు. మొదటి సారిగా ఆయన పేరు మీదే ఒక సినిమా చేసినప్పటికీ అది కూడా సక్సెస్ కాలేకపోయింది. ఆ తరువాత ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ కూడా అవన్నీ డిజాస్టర్ గా మిగిలి పోతున్నాయి. ఇక తాజాగా అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంతో అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ హీరో.

హీరో అఖిల్ తన సినిమా ప్రమోషన్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో బిజీగా ఉన్నాడు. ఇదే క్రమంలో ని తన మొబైల్ వాల్పేపర్ పై ఉన్న ఒక ఫోటోను తెలియజేశాడువాల్ పేపర్ మీద ఉన్న తన తాత, లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు ఫోటో ని చూపించాడు. ఈ సందర్భంగా అఖిల్..”నేను నా నా మొబైల్ ఓపెన్ చేసిన వెంటనే కనిపించే ఫోటో ఇదే.. 10 సంవత్సరాల నుంచి ఇదే ఫోటోను చూస్తున్నాను. మా తాతగారికి సంబంధించి నాకు ఇష్టమైన స్టిల్ ఇదే అని తెలియజేశాడు.Akhil Akkineni shares important photo on his phone

అయితే ఈ ఫోటో సినిమాలోది కాదు.. తాతయ్య ఆడిషన్ చేసినప్పుడు లుక్ టెస్ట్ కోసం తీసిన ఫోటో ఇది.. నాకు బాగా నచ్చడంతో పది సంవత్సరాల నుంచి ఇది నా దగ్గర అలాగే ఉండి పోయింది అని చెప్పుకొచ్చాడు. ఒకవేళ ఫోన్ మార్చిన కూడా ఈ ఫోటోని మార్చాలని తేల్చి చెప్పాడు.

Share post:

Latest