గత 25 సంవత్సరాలుగా వెంకటేష్ తో మాట్లాడని రోజా..కారణం..!

సినీ ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉండే హీరో ఎవరంటే విక్టరీ వెంకటేష్ అని చెప్పుకోవచ్చు. పోటీగా ఎంత మంది స్టార్ హీరోలు ఉన్న ఆ స్టార్ హీరోలు అలాగే వారి అభిమానులు కూడా వెంకటేష్ సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుంటూ ఉంటారు.వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతమంది ఉన్నారు మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఈ మధ్యనే నారప్ప సినిమాతో మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు వెంకటేష్.

అయితే వెంకటేష్ అంటే సరిపోని ఒక హీరోయిన్ ఉన్నదట.. ఏకంగా ఆ హీరోయిన్ తో వెంకటేశ్ కు 25 సంవత్సరాలుగా మాటలు లేవని వినిపిస్తోంది. ఇది వినడానికి విడ్డూరంగా ఉన్న ఇది నిజమే.. ఆమె మరెవరో కాదు హీరోయిన్ రోజా, వైసిపి ఎమ్మెల్యే. వాస్తవానికి వెంకటేష్ నటించిన”చిన రాయుడు”సినిమాలో హీరోయిన్గా నటించాల్సి ఉంది రోజా.

Chinna Rayudu (1992) Telugu Songs Lyrics - AtoZ Lyrics - Telugu Songs  Lyrics | A to Z Telugu Songs Lyrics in English | Old Telugu Songs Lyrics

కానీ దర్శక నిర్మాతలు పట్టుబట్టి విజయశాంతి ని హీరోయిన్ గా తీసుకువచ్చారు..దీంతో రోజా నిలదీసి అడిగిందట. కానీ దర్శక నిర్మాతలు పట్టు వల్లనే అలా చేయవలసి వచ్చిందని వెంకీ తెలియజేశారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి..”పోకిరి రాజా”అనే సినిమాలో నటించారు. కానీ ఈ సినిమా అయిష్టంగానే చేసినట్లు రోజా తెలిసింది. ఇక ఆ తర్వాత వీరిద్దరూ మాట్లాడుకో లేదట.