డ్రీమ్ 11పై కేసు నమోదు …?

ఐపిఎల్ మరో 4 రోజుల్లో ముగుస్తుందనగా ఐపిఎల్ బిగ్ స్పాన్సర్ అయిన డ్రీమ్11పై కేసు నమోదైంది. డ్రీమ్11 నిబంధనలు ఉల్లంఘించినట్లుగా బెంగుళూరులో ఎఫ్ఐఆర్ నమోదైంది. డ్రీమ్ 11 వ్యవస్థాపకులు అయినటువంటి హర్ష్ జైన్, భవిత్ సేథ్‌లపై ఎఫ్ఐఆర్ ను పోలీసులు నమోదు చేశారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌పై నిషేధం ఉంది. అయినా కూడా నిషేధిత గేమ్స్ ఇంకా ఆడుతూనే ఉన్నారు. తాజాగా ఫాంటరీ గేమ్స్ పై అక్టోబర్ 5వ తేది నుంచి కర్ణాటక సర్కార్ కూడా నిషేధం విధించింది.

ఈ మధ్యకాలంలో కర్ణాటకలో చాలా యాప్స్ వాడకూడదని నిషేధం విధించారు. అందులో డ్రీమ్11 కూడా ఉంది. డ్రీమ్11 యాప్‌ను కర్ణాటకలో నిర్వహిస్తుండటంతో బెంగళూరు పోలీసులకు ఓ వ్యక్తి కేసు పెట్టాడు. బెంగళూరుకు చెందిన మంజునాథ్ అనే వ్యక్తి డ్రీమ్11 ఐపీఎల్ మ్యాచ్ ప్రిడిక్షన్స్‌లో బెట్టింగ్ పెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మంజునాథ్ తప్పకుండా డబ్బులు గెలుస్తాడని చెప్పిన డ్రీమ్11 తనను ఇప్పుడు మోసం చేసిందని కేసు పెట్టాడు. దీంతో డ్రీమ్11పై ఎఫ్ఐఆర్ నమోదైంది.