2022 వ సంవత్సరం సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ కావడానికి సిద్ధమవుతున్నాయి. అందులో మల్టీ స్టారర్ చిత్రాలలో విక్టరీ వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ లు కలిసి చేస్తున్న సినిమా “F 3″కూడా ఉంది. వరుసగా హిట్ చిత్రాలను కొట్టిన దర్శకుడు అనీల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ చాలా వేగంగా కంప్లీట్ అవుతోంది. అయితే ఈ సినిమా సెట్లోకి పుష్ప సడెన్ గా ఎంట్రీ ఇవ్వడం సర్ ప్రైజింగ్ గా అనిపించింది.
షూటింగ్ స్పాట్ లో ఉన్నటువంటి స్టార్ హీరో వెంకటేష్, వరుణ్ తేజ్, వీరితో సహా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ లతో అల్లు అర్జున్ ముచ్చటించారు. అలాగే దర్శకుడు రావిపూడి తో బన్నీ కలిసి మాట్లాడడం జరిగింది. దీనితో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ చిత్రంలో తమన్నా, మెహరీన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాకి నిర్మాతగా దిల్ రాజ్ రూపొందిస్తున్నాడు. అంతేకాదు ఎఫ్3 సెట్లోకి బన్నీ రావడంతో సెట్ మొత్తం సందడిగా అనిపించింది .