ఈవారం బాక్సాఫీస్ దగ్గర సందడి చేయడానికి సిద్ధమైన సినిమాలు..?

దసరా కానుకగా కాస్త పేరున్న సినిమాలు థియేటర్లో విడుదల కాగా.. ఆ తర్వాత కొన్ని చిన్న సినిమాలు కూడా వెంటనే రిలీజ్ అయ్యాయి. ఈ వారం కూడా కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరికొన్ని పోటీలో కూడా విడుదల కాబోతున్నాయి విశేషాలను చూద్దాం.

1). రొమాంటిక్:
ఆకాష్ పూరి, కేతిక శర్మ కలిసి నటిస్తున్న చిత్రం రొమాంటిక్. ఈ సినిమా అక్టోబర్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

2). వరుడు కావలెను:
నాగ శౌర్య, రీతు వర్మ కలిసి జంటగా నటించిన చిత్రం వరుడు కావలెను. ఈ సినిమా కూడా అక్టోబర్ 29 వ తేదీన విడుదల కాబోతోంది.

3). తీరం:
అనిల్ హీరోగా, అపర్ణ హీరోయిన్ గా కలిసి నటిస్తున్న చిత్రం తీరం. ఈ సినిమా కూడా ఈ నెల 29వ తేదిన విడుదల కాబోతుంది.

4). రావణ లంక:
క్రిస్ బండపల్లి, అస్మిత కౌర్ జంటగా నటిస్తున్న చిత్రం రావణ లంక. ఈ సినిమా కూడా అక్టోబర్ 29వ తేదీన విడుదల కాబోతోంది.

1). ఫ్యామిలీ డ్రామా సినిమా సోనీ లైవ్ లో అక్టోబర్ 29వ తేదిన విడుదలవుతోంది.

2). డైబుక్‌ (హిందీ) అక్టోబరు 29వ తేదీ విడుదల అవుతుంది.