ప్ర‌భాస్ `స్పిరిట్‌` మొద‌ట ఏ హీరో వ‌ద్ద‌కు వెళ్లిందో తెలుసా?

రెబ‌ల్‌ స్టార్ ప్ర‌భాస్ త‌న 25వ చిత్రాన్ని ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగాతో చేయ‌బోతున్న‌ట్టు నిన్న అధికారికంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌కు `స్పిరిట్‌` అనే టైటిల్‌ను ఖ‌రారు చేయ‌గా.. టీ సిరీస్, భద్రకాళి ఫిలిమ్స్, యువి క్రియేషన్స్ బ్యాన‌ర్ల‌పై భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని నిర్మించ‌బోతున్నారు.

After Kabir Singh, Is This The Concept Of Director Sandeep Reddy Vanga's Next Film? Read On!

తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మల‌యాళ భాష‌ల్లోనే కాకుండా విదేశీ భాష‌ల్లోనూ ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఇదిలా ఉంటే.. ఈ మూవీనికి సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ విష‌యం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే.. అస‌లు స్పిరిట్ స్టోరీ మొద‌ట ప్ర‌భాస్ వ‌ద్ద‌కు వెళ్ల‌లేద‌ట‌. డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ క‌థను సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కోసం రాశార‌ట‌.

Mahesh Babu takes the first dose of Covid-19 vaccine; urges everyone to do so | Telugu Movie News - Times of India

అయితే ఆ క‌థ మ‌హేష్ కు న‌చ్చ‌లేద‌ట‌. దాంతో కొన్ని మార్పులు, చేర్పులు చేసి ఆ క‌థను ప్ర‌భాస్‌కు వినిపించ‌గా.. ఆయ‌న వెంట‌నే ఇంప్రెస్ అయ్యాయ‌ని టాక్ న‌డుస్తోంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాల్సి ఉంది.

Share post:

Latest