చిరు కోసం అభిమాని భారీ సాహ‌సం..ఆశ్చ‌ర్య‌పోయిన మెగాస్టార్‌!

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు తెలియ‌ని వారుండ‌రు. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన చిరు.. అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ మెగా సామ్రాజ్యాన్నే నిర్మించారు. అంతేకాదు, కోట్లాది ప్రేక్ష‌కుల మ‌న‌సు గెలుచుకుని త‌న అభిమానులుగా మార్చుకున్నాడు. అయితే తాజాగా చిరంజీవి కోసం ఓ అభిమాని చేసిన భారీ సాహ‌సం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Chiranjeevi birthday: 12 of his best songs that made him 'King of Dance' | Entertainment News,The Indian Express

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..ఉప్పలగుప్తం మండలం కిత్తన చెరువు గ్రామానికి చెందిన దివ్యాంగుడు డెక్కల గంగాధర్ (32) మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. ఆయనను కలవాలని ఈ నెల 3వ తేదీ అమలాపురం నుండి పాదయాత్ర చేపట్టి 23 రోజుల పాటు ఏకంగా 727 కి. మీ నడిచి సోమవారం బ్లడ్ బ్యాంక్ దగ్గరకి చేరుకున్నాడు.

తూ.గో.. అమలాపురం To హైదరాబాద్ చిరంజీవి అభిమాని పాదయాత్ర… - Telugu 25 Years Chiranjeevi Fan Gangadhar Dekkala Master Movie Padayatra Amalapuram Hyderabad Physically Handicapped-TeluguStop

అంగవైకల్యని సైతం లెక్కచేయకుండా త‌న కోసం అన్ని వంద‌ల కిలోమిట‌ర్లు పాదయాత్ర చేసినందుకు ఆశ్చ‌ర్య‌పోయిన చిరు.. వెంట‌నే గంగాధ‌ర్‌ను ఇంటికి పిలిపించుకుని కాసేపు ముచ్చటించారు. అలాగే మ‌రోసారి నిన్ను ప్రత్యేకంగా క‌లుస్తాన‌ని స‌ద‌రు అభిమానికి చిరు మాటిచ్చారు. దాంతో ఆనందంతో ఉబ్బ‌త‌బ్బిపోయాడు గంగాధ‌ర్‌.

Share post:

Latest