వారికే నా మ‌ద్ద‌తు..ఎట్ట‌కేల‌కు నోరువిప్పిన చిరంజీవి..!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు హైద‌రాబాద్‌లోని జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో నేటి ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభం అయ్యాయి. మా ఆధ్య‌క్ష ప‌ద‌వి కోసం నటులు ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు పోటీ ప‌డుతుండ‌గా.. ఎవ‌రి స‌త్తా ఏంటో ఈ రోజు తేలిపోనుంది.

- Advertisement -

MAA Elections : 'మా' ఎలక్షన్స్ రేపే.. గెలుపెవరిది?? | MAA Elections

ప్ర‌స్తుతం సినీ ప్ర‌ముఖులు ఒక్కొక్కరిగా ఓటు హ‌క్కును వినియోగించుకుంటున్న‌రు. మెగా స్టార్ చిరంజీవి కూడా ఓటు వేశారు. అయితే ఓటు హక్కును వినియోగించుకొని బయటకు వచ్చిన చిరంజీవి.. మీడియాతో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ క్ర‌మంలోనే త‌న మ‌ద్ద‌తు ఎవ‌రికో నోరువిప్పారు.

అంతరాత్మ చెప్పిన వారికి ఓటేసాను-వారికే నా మద్దతు..చిరంజీవి : నమ్మకం ఉన్నవారికి ఓటేసాను..బాలక్రిష్ణ..!! | Chiranjeevi and Balakrishna interesting comments on MAA ...

పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒక్కోసారి మారుతోన్న పరిస్థితులకు అనుగుణంగా సమాయత్తం కావాల్సి ఉంటుంది. ఏదేమైనా మీ మీడియాకు మంచి మెటిరియల్‌ దొరికింది కదా.. అనందించండి అంటూ చమత్కరించారు. ఇక ఎక్కువ శాతం కళాకారులు ఎవరిని ఎన్నుకుంటే వారికే నా మద్ధతు అని చిరు చెప్పుకొచ్చారు.

Share post:

Popular