అజిత్ ఫోటోలను షేర్ చేసిన బోని కపూర్?

హీరో అజిత్ కుమార్ గురించి, అతనికి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాస్ హీరోగా అభిమానులను అలరించే సినిమాలు చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కెరీర్ మొదట్లో ప్రేమ కథా చిత్రాలతో లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇతని సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. హీరో అజిత్ కి నటనతో పాటుగా బైక్ రైడింగ్ అంటే కూడా చాలా ఇష్టం.అందుకే సమయం దొరికినప్పుడల్లా బైక్ పై యాత్రలు చేస్తూ ఉంటాడు.

హెచ్ వినోద్ దర్శకత్వంలో బోనీ కపూర్ నిర్మాణంలో అజిత్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం వాలిమై. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం వర్షాలు జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అలా టూర్ కి వెళ్లి వచ్చాడు ఈ హీరో. అయితే తాజాగా ఆ మూవీ షూటింగ్ సమయంలో గ్యాప్ దొరకడంతో వాఘా సరిహద్దుకు వెళ్లాడు అజిత్.

అక్కడ గేటు దగ్గర నిల్చుని మూడు రంగుల జెండా ని పట్టుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. ఇదే విషయాన్ని బోని కపూర్ తెలియజేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇందులో అజిత్ సైనికులతో కలిసి ఫోటోలు దిగారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.