బిగ్ బాస్ లో ఆ కంటెస్టెంట్ కు మద్దతు.. హరితేజ?

తెలుగు బుల్లితెరపై ఇప్పటికే నాలుగు సీజన్ లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఐదవ సీజన్ అడుగుపెట్టి కొనసాగుతోంది. ఇందులో సోషల్ మీడియా వారిని అలాగే యూట్యూబ్ కాళ్ళ మీద ఫోకస్ పెట్టి, ఈసారి కూడా ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని ముఖాలను హౌస్ లోకి తీసుకు వచ్చారు.ఇప్పటికే రెండు ఈ హౌస్ లో కొట్లాటలు, నవ్వులు డాన్స్ లు మొదలయ్యాయి. అంతేకాకుండా లహరి, ఉమాదేవి, లాంటి కంటెస్టెంట్ లు ఎలిమినేట్ కూడా అయ్యారు. ఈ బిగ్ బాస్ షో లో పలువురు కంటెస్టెంట్ లకు బయట సెలబ్రిటీల నుంచి సపోర్ట్ గట్టిగానే ఉన్నట్టు కనిపిస్తోంది.

సీనియర్ నటి ప్రియా కు గత సీజన్ బిగ్ బాస్ రన్నరప్ అఖిల్ సార్థక్ మద్దతుగా నిలుస్తున్నారు. అలాగే మానస్ కి హీరో సందీప్ కిషన్ సపోర్ట్ చేస్తున్నాడు. తాజాగా ఆర్.జె కాజల్ మద్దతుగా పలుకుతూ ఇంస్టాగ్రామ్ లో లైవ్ లోకి వచ్చింది హరితేజ. మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన హరితేజ ఆర్ జే కాజల్ కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని అందులో సందేహమేమీ లేదు అంటోంది. ఈవారం నామినేషన్ లో ఉన్న ఆమెకు అభిమానులు అందరూ ఓట్లు వేసి సేవ చేయాలని హరితేజ కోరుతోంది. సాంగ్ కంటెస్టెంట్ అయినా కాజల్ తప్పకుండా టాప్ ఫైవ్ లో ఉంటుందని ధీమా వ్యక్తం చేసింది హరితేజ. అందుకోసం అప్పటి వరకు ఆమెకు అందరూ సపోర్ట్ చేయమని అభ్యర్థించింది.

Share post:

Popular