నేడే `మా` ఎన్నిక‌లు..ఆఖరి నిమిషంలో బండ్ల‌న్న ట్విస్ట్ అదిరిందిగా!

`మా` ఎన్నిక‌లు మ‌రికాసేప‌ట్లో ప్రారంభం కాబోతున్నాయి. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో నేటి ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకూ పోలింగ్ జరగబోతోంది. ఈ సారి మా అధ్యక్ష పదవికి ప్రకాశ్ రాజ్, మంచు విష్ణులు పోటీ ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే నటీనటులు రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై మరొకరు హ‌ద్దులు దాటి మ‌రీ విమర్శలు గుప్పించుకున్నారు.

- Advertisement -

Bitterness between Prakash Raj, Vishnu Manchu intensifies ahead of MAA elections | Entertainment News,The Indian Express

ఇదిలా ఉంటే ‘మా’ ఎన్నికల ప్రారంభం నుంచి ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చుకుంటూ వస్తోన్న బండ్ల గణేశ్.. ఆఖ‌రి నిమిషంలో మ‌రో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. అనేక పరిణామాల అనంతరం ప్రకాష్ రాజ్ ప్యానల్‌కు సపోర్ట్ చేసిన బండ్ల‌న్న‌.. ఇప్పుడు అనూహ్యంగా మంచు విష్ణు ప్యానల్‌ నుంచి జనరల్ సెక్రటరీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న రఘు బాబుకు ఓటు వేయాలని కోరాడు.

Bandla Ganesh: Prakash Raj: The beginning is a setback .. Prakash Raj's humiliation .. Bandla Ganesh who entered the competition - bandla ganesh humilitaes prakash raj and wants to conduct as general secretary » Jsnewstimes

`మా సభ్యులకు విన్నపం దయచేసి మీ అమూల్యమైన ఓటు జనరల్ సెక్రెటరీగా రఘు బాబు వేసి గెలిపించ వలసినదిగా నా ప్రార్థన మీ బండ్ల గణేష్ ` అంటూ తాజాగా ట్వీట్ చేశారు. కాగా, ప్ర‌కాశ్ రాజ్ ప్యానెల్ నుంచి జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా జీవిత పోటీ చేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఆమెకు వ్య‌తిరేఖంగా ర‌ఘు బాబుకు బండ్ల గ‌ణేష్ స‌పోర్ట్ చేస్తున్నాడు.

Share post:

Popular