బాలయ్య-రాములమ్మ మధ్య గొడవ కారణం..వీడియో వైరల్..?

తెలుగుతెరపై ఎన్నో హిట్ సినిమాలు చేసి మంచి జంటగా పేరు పొందిన హీరో హీరోయిన్లు చాలామందే ఉంటారు. అలాంటి వారిలో నందమూరి బాలకృష్ణ విజయశాంతి కూడా ఒకరు. 1980 సంవత్సరంలో దాదాపుగా వీరిద్దరి కాంబినేషన్ లోనే 17 సినిమాలకు పైగా నటించారు. దాంతో పాటు సినీ నిర్మాతలకు లాభాల పంట కూడా పండించారు.

ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిట్టచివరి సినిమా నిప్పురవ్వ. ఇక ఈ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి నటించడం మానేశారు. అయితే వీరిద్దరూ కలసి నటించడం మానేసిన తర్వాత అటు సినీ ఇండస్ట్రీలో, ఇటు ప్రేక్షకులలో రకరకాలుగా వార్తలు వినిపించాయి. నిప్పురవ్వ సినిమా సమయంలో బాలకృష్ణ విజయశాంతి మధ్య తీవ్రమైన విభేదాలు వచ్చాయని అందుకే వీరిద్దరూ కలిసి నటించడం లేదని వార్తలు బాగా పుకార్లు లేపాయి.

ఈ వార్తల కి చెక్ పెట్టేందుకు విజయశాంతి ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ లో తెలియజేసింది. నిప్పురవ్వ సినిమా తరువాత తన రెమ్యునరేషన్ అమాంతంగా పెరిగిపోయిందని తెలియజేసింది. ఆ తరువాత నేను ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల వైపు ఫోకస్ పెట్టానని. ఆ తర్వాత మళ్ళీ బాలయ్య తో సినిమా సెట్ కాలేదని తెలియజేసింది విజయశాంతి. అంతే తప్ప మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు చోటు చేసుకోలేదని తెలియజేస్తోంది విజయశాంతి.

Share post:

Latest