తల్లిదండ్రులను చూడగానే కన్నీటిపర్యంతమైన ఆర్యన్ ఖాన్?

బాలీవుడ్‌ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయంలో అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో, ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా ఆర్యన్ ఖాన్ బెయిల్ విచారణ విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పటికే ఆర్యన్ కు ముంబై కోర్టు మూడు సార్లు బెయిల్ నిరాకరించగా, ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే ఆయనకు తల్లిదండ్రుల తో మాట్లాడే అవకాశాన్ని కల్పించింది ముంబై కోర్టు. ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులో నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన తల్లిదండ్రులు షారుక్ ఖాన్, గౌరీ ఖాన్ తో ఆర్యన్ మాట్లాడాడు.

అయితే గత కొద్ది రోజులుగా జైలులోనే ఉంటున్న ఆర్యన్ తన తల్లిదండ్రులను చూడగానే ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యాడట. అయితే జైలులో ఉన్న ప్రతి వ్యక్తి వారానికి రెండు సార్లు తన కుటుంబ సభ్యులతో మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఆర్యన్ ఖాన్ కి కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం కల్పించారు. ఈ డ్రెస్ కేసులో ఆర్యన్ బెయిల్ పిటిషన్ పై రెండు రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన సెషన్స్ కోర్టు రిజర్వ్ లో పెట్టింది. అక్టోబర్ 20వ తేదీ వరకు జడ్జి పిటిషన్ తీర్పును రిజర్వులో పెట్టారు.

Share post:

Latest