కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడిన నటి మదాలస?

తమిళ బుల్లితెర నటి మదాలస శర్మ తెలుగు తమిళం పంజాబీ సినిమాలలో నటించింది. కానీ ఎన్ని సినిమాలు చేసినా ఆమెకు తగిన గుర్తింపు దక్కకపోవడంతో ఆమె బాలీవుడ్ బుల్లితెరపై వాలిపోయింది. బాలీవుడ్ లో అనుపమ సీరియల్ ద్వారా ఆమె తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరచుకుంది. ఇక ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాస్టింగ్ కౌచ్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఏ వృత్తిలో అయినా, ఎక్కడికి వెళ్ళినా.. ఒక అమ్మాయి ఉంది అంటే చాలు ఆమె చుట్టూ పురుషులు కూడా ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు ఆమె మీద ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు.

అయితే వారి ప్రవర్తనను బట్టి మనం ఎలా నడుచుకోవాలి అనేది మన చేతుల్లోనే ఉంటుంది అని తెలిపింది. అంతేకాకుండా ఈ నేపథ్యంలో కొందరు మిమ్మల్ని ఇన్ ఫ్లూయెన్స్ చేయడానికి ప్రయత్నిస్తారు, అలాంటప్పుడు ప్రభావితం కావడం,కాకపోవడం అనేది కూడా మన చేతుల్లోనే ఉంటుంది. అలాంటి దాన్ని వేరే ఎవరూ మార్చలేరు. అయితే ఎవరైనా ఉన్నప్పుడు సౌకర్యంగా అనిపించకపోతే వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతాను. ఇప్పుడు నన్ను ఎవరు ఆఫరు కదా. నేను ఒక నటిని నా ప్రతిభను చాటేందుకు ఇక్కడి దాకా వచ్చాను. ఇందుకోసం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే సత్తా నాకు ఉంది అంటూ మదాలస చెప్పుకొచ్చింది.

Share post:

Latest