యాంకర్ హరితేజ ఇల్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఈ మధ్య కాలంలో చాలామంది నటీనటులు హోమ్ టూర్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే మొన్నామధ్య కమెడియన్ ఆలీ కూడా ఇలాగే హోమ్ టూర్ నిర్వహించి తన అద్భుతమైన ఇంటిని ప్రేక్షకులకు,తన అభిమానులకు చూపించాడు. ఇక ఈ క్రమంలోనే యాంకర్ హరితేజ కూడా హోం టూర్ చేసి మరీ చూపించింది. మొదట తన ఇంటి బయట ప్రత్యేకంగా కార్పెంటర్ తో తయారు చేయించుకున్నట్లు చూపించింది. ముఖ్యంగా ఈ వీడియోలో తన ఇంటికి రెండు కాలింగ్ బెల్స్ ను కూడా ఏర్పాటు చేసినట్లు హరితేజ చూపించింది.

ఇక తన ఇంట్లో ఆమె భర్త దీపు తో కలిసి దిగిన ఫోటో ఒకటి అరెంజ్ చేసినట్లు, ఆమె సంపాదించుకున్న అవార్డులను కూడా చూపించింది. ముఖ్యంగా బిగ్బాస్ షోలో తనకు జూనియర్ ఎన్టీఆర్ స్వహస్తాలతో అందించిన ఒక అవార్డును కూడా చూపించి మురిసిపోయింది. ఇలా కిచెన్ , బెడ్ రూమ్ , హాల్ ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా దగ్గరుండి డిజైన్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. హరికథలు అనే ఒక ఛానల్ ద్వారా ఆమె యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ఈ హోమ్ టూర్ వీడియో అతి తక్కువ సమయంలోనే మంచి వ్యూస్ ను , లైక్స్ ను సొంతం చేసుకుంటోంది.

Share post:

Latest