చంద్ర‌బాబుపై ఆమంచి సూప‌ర్ పంచ్‌లు.. పేలిపోయాయ్‌..!

టీడీపీ నేత చంద్ర‌బాబు చేప‌ట్టిన‌.. దీక్ష‌కు ప్ర‌తిగా.. వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్‌ను దూషించ‌డంపై ఆ పార్టీ నేత‌లు.. రాష్ట్ర వ్యాప్తంగా.. జ‌నాగ్ర‌హ దీక్ష‌లు చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో రాష్ట్ర వ్యాప్తంగా.. భారీ ఎత్తున వైసీపీ నాయ‌కులు, ఎమ్మెల్యేలు.. జ‌నాగ్ర‌హ దీక్ష‌లో పాల్గొన్నారు. ఇదేస‌మ‌యంలో ప్ర‌కాశం జిల్లా చీరాల‌లో చేప‌ట్టిన‌..జ‌నాగ్ర‌హ దీక్ష‌కు ఊహించ‌ని విధంగా రెస్పాన్స్ వ‌చ్చింది. మాజీ ఎమ్మెల్యే.. ప్ర‌స్తుత చీరాల వైసీపీ ఇంచార్జ్ ఆమంచి కృష్ణ‌మోహ‌న్ ఆధ్వ‌ర్యంలో యువ‌త‌ భారీ ఎత్తున త‌ర‌లి వ‌చ్చి.. టీడీపీ బూతుల‌పై నిర‌స‌న వ్య‌క్తం చేసింది. ఈ సంద‌ర్భంగా టీడీపీ పై విరుచుకుప‌డ్డ‌.. ఆమంచి.. తీవ్ర‌స్థాయిలో నిప్పులు చెరిగారు.

ఆమంచి మాట్లాడుతున్న స‌మ‌యంలో ప్ర‌తి ఒక్క‌రూ చ‌ప్ప‌ట్ల‌తో ఉర్రూత‌లూగిపోయారు. ఆమంచి మాట్లా డుతూ.. చంద్రబాబు డెరెక్షన్ లోనే పట్టాభి బూతులు తిట్టార‌ని అన్నారు. ఇలాంటివారిని ఏం చేయాలో ప్ర‌జ‌లే నిర్ణ‌యించాల‌ని పిలుపునిచ్చారు. ప్ర‌జ‌లు చంద్ర‌బాబును ఇప్ప‌టికీ నమ్మ‌డం లేద‌న్న ఆమంచి.. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌లు సీఎం జ‌గ‌న్‌ను న‌మ్ముతున్నారో.. చంద్ర‌బాబును న‌మ్ముతున్నారో.. IVRS సర్వే చేయించాల‌ని అన్నారు.. చంద్రబాబు వయసుకు తగ్గ ఆలోచనలు చేయడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో గొడవలు సృష్టించాలన్నాదే బాబు లక్ష్యమని అన్నారు.

గతంలో అయ్యన్నపాత్రుడుతో దుర్భాషలాడించారని.. అప్పుడు వారి ప్లాన్‌ ఫలించలేదని ఆమంచి తెలిపారు. ఇదే క్రమంలో టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిని తామెవరం కూడా సమర్ధించడం లేదని స్వష్టం చేశారు .ఇదే క్రమంలో సీఎంపై అనుచిత వ్యాఖ్యల ప్లాన్ మాత్రం చంద్రబాబు కుట్రేనన్నారు. చంద్రబాబు అధికారంలో ఉండగా బోయపాటి డెరెక్షన్ లో గోదావరి పుష్కరాలలో సుమారు 30 మంది మృతి చెందినపుడు …అలాగే అధికారంలోకి వచ్చిన మూడు నెలలో శేషాచలం అడవులలో తమిళ కూలీలను పిట్టలను కాల్చి చంపినపుడు.. చంద్ర‌బాబు క‌మిష‌న్లు ఎందుకు వేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు.

మొత్తంగా ఆమంచి చేసిన వ్యాఖ్య‌లు వైసీపీ వ‌ర్గాల్లోనే కాకుండా.. నియోజ‌క‌వ‌ర్గం మొత్తం కూడా ఆస‌క్తిగా మారాయి. వాస్త‌వానికి ఆమంచి అంటేనేఫైర్ బ్రాండ్ అనే విష‌యం తెలిసిందే. ఆయ‌న ఏం మాట్లాడినా.. ఆస‌క్తిగా ఉండ‌డంతోపాటు మంచి స‌బ్జెక్ట్ కూడా ఎంచుకుంటార‌ని అంటారు. ఇప్పుడు .. చంద్ర‌బాబు దీక్ష‌పై ఆమంచి చేసిన వ్యాఖ్య‌లు.. రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆలోచ‌న‌కు దారితీశాయ‌ని.. నిజ‌మే క‌దా.. చంద్ర‌బాబు ఇప్పుడు క‌మిష‌న్లు వేస్తామ‌ని.. అంతు తేలుస్తామ‌ని.. క‌థ చెబుతామ‌ని.. అంటున్నార‌ని.. మ‌రి త‌న హ‌యాంలో జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌పై ఏం చేశార‌ని ఆమంచి ప్ర‌శ్నించడం స‌హేతుక‌మేన‌ని చెబుతున్నారు.

మొత్తానికి ఆమంచి ఆధ్వ‌ర్యంలో చీరాల నియ‌జ‌క‌వ‌ర్గంలో చేప‌ట్టి.. వైసీపీ జ‌నాగ్ర‌హ దీక్ష‌ల‌కు.. మంచి స్పంద‌నే వ‌చ్చింది. ప్ర‌తి ఒక్క‌రూ క‌దిలి వ‌చ్చారు. యువ‌త నుంచి వృద్ధుల వ‌రకు అంద‌రూ ఆమంచికి జై కొట్టారు. వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను దూషించిన టీడీపీ నేత‌ల‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. ఆమంచి కి జైకొట్టారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీకి నూత‌న ఉత్తేజం వ‌చ్చింద‌నే టాక్ స‌ర్వ‌త్రా వినిపించ‌డం గ‌మ‌నార్హం.