విజయ్ దేవ‌ర‌కొండ ఎదుగుద‌ల‌పై బ‌న్నీ షాకింగ్ కామెంట్స్‌!

టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `అర్జున్ రెడ్డి` సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిన విజ‌య్‌.. ఆ త‌ర్వాత వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. వ‌రుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈయ‌న త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌`తో పాన్ ఇండియా హీరో కూడా కాబోతున్నాడు. మ‌రోవైపు ప‌లు వ్యాపారాలు చేస్తూ రియల్ బిజినెస్ మేన్‌ అనిపించుకుంటున్నారు. అలాగే ఇటీవ‌ల నిర్మాత‌గానూ మారిన విజ‌య్‌.. యంగ్ టాలెంట్ ప్రోత్స‌హిస్తున్నారు.

Allu Arjun: పునీత్‌ అంటే నాకు చాలా ఇష్టం: అల్లు అర్జున్‌ - allu arjun and vijay deverakonda speak about puneet rajkumar

ఇక ఈయ‌న తాజాగా నిర్మించిన చిత్ర `పుష్పక విమానం`. విజ‌య్ త‌మ్ముడు ఆనంద్ దేవరకొండ ఈ మూవీలో హీరోగా న‌టించ‌గా.. దామోదర ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. శాన్వి మేఘన హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రం న‌వంబ‌ర్ 12న విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే నిన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ మూవీ ట్రైలర్‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. విజ‌య్ దేవ‌ర‌కొండ ఎదుగుద‌ల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేశారు.

Allu Arjun Vs Vijay Devarakonda: Rate who's best, and why? | IWMBuzz

`విజయ్ దేవరకొండ ఎంత ఇంటెలిజెంటో అంత స్వీట్. అందుకే నాకు చాలా ఇష్టం. చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ స్టార్డం వచ్చింది. కేవలం నటనే కాదు.. వ్యాపారాల్లోనూ సక్సెస్ అయ్యాడు. ఇక ఇటీవ‌ల నిర్మాత‌గా మారి యంగ్ టాలెంట్‌కు సాయం చేస్తున్నాడు. విజయ్ అలా ఎదిగిపోతూ ఉంటే మీకు జెలస్ అనిపించదా? అని కొందరు అడిగారు. జెలస్ ఎందుకు ఉంటుంది. అలా అనుకున్నప్పుడు మనం కరెక్ట్‌గా పని చేయడం లేదన్నట్టు. ఇదో పరుగు పందెం..ఇందులో మనం పక్కన చూసి పరిగెత్త కూడదు. మన దారిలో మనం పరిగెత్తాలి` అంటూ బ‌న్నీ చెప్పుకొచ్చాడు.

 

Share post:

Popular