ఆర్యన్ ఖాన్ కి మద్దతుగా షారుక్ ఫ్యాన్స్..?

బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ విషయంలో అరెస్ట్ అయిన విషయం అందరికి తెలిసిందే. ఆర్యన్ ఖాన్ అరెస్టు కావడం దేశవ్యాప్తంగా సంచలనం అయింది. ఈ నేపథ్యంలో ఆర్యన్ కి పలువురు ప్రముఖులు మద్దతుగా నిలిచారు. ఎస్బిఐ కస్టడీలో ఉన్న ఆర్యన్ ఖాన్ ఒకరోజు విచారణ తర్వాత బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, కొట్టివేసిన కోర్టు కస్టడీని అక్టోబర్ 8 వరకు పొడిగించడం జరిగింది.

ఈ తరుణంలో షారుక్ ఫ్యాన్స్ ఆయన కుటుంబానికి అలాగే ఆర్యన్ కి మద్దతుగా నిలుస్తున్నారు.ఎంతోమంది షారుక్ ఖాన్ అభిమానులు మేము మీతో ఉన్నాం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనితో ట్విట్టర్ లో #westandwithsrk ట్రెండింగ్ లోకి వచ్చింది.


ఈ సందర్భంగా కేవలం షారుక్ ఖాన్ అభిమానులే కాకుండా బాలీవుడ్ ప్రముఖులు సైతం షారుక్ కుటుంబానికి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ తరుణంలో ఆర్యన్ గతంలో చిన్నారికి డబ్బులు దానం చేసిన ఒక వీడియో వైరల్ గా మారింది. ఆర్యన్ తో పాటు మొత్తం 8 మంది పై డ్రగ్స్ కేసు నమోదు అయ్యింది.