ఒక్కసారిగా నా మైండ్ బ్లాంక్ అయ్యింది.. సమంత తండ్రి ఆవేదన..!

టాలీవుడ్ లో అందమైన ప్రేమ జంట గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు నాగ చైతన్య, సమంత. వాళ్లు విడిపోతున్నట్లు కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంటే చాలామంది నమ్మలేదు. ఇది నిజం అయి ఉండదు అని కొట్టిపారేశారు. వాళ్ళు అలా అనుకోవడానికి కారణం..చైతు సామ్ మొదటినుంచి అన్యోన్యంగా ఉండడమే. దానికి తోడు సమంత నాగార్జున ఫ్యామిలీ తో చాలా దగ్గరగా ఉంటూ వచ్చింది.

చైతన్య, సమంత విడాకులు తీసుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించడంతో అంతా షాక్ అయ్యారు. దీనిపై ఇప్పటికే నాగార్జున కూడా స్పందించిన సంగతి తెలిసిందే. చైతు, సామ్ విడిపోవడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చైతు తో విడాకులు తీసుకుంటున్నట్టు సమంత ప్రకటించిన తర్వాత తొలిసారిగా ఆమె తండ్రి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

‘ ప్రస్తుతం నా మైండ్ బ్లాక్ అయ్యింది’ అని ఆయన ట్వీట్ చేశారు. సమంతకు అన్ని తెలిసే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నానని పేర్కొన్నారు. త్వరలోనే ఈ పరిస్థితులు చక్కబడతాయని జోసెఫ్ ప్రభు ఆశా భావం వ్యక్తం చేశారు. జోసెఫ్ ప్రభు ట్వీట్ కి సమంత ఫ్యాన్స్ మద్దతు ఇస్తున్నారు.ధైర్యంగా ఉండాలని ట్వీట్లు చేస్తున్నారు.