మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `శ్రీ` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. `కొంచెం ఇష్టం కొంచెం కష్టం` సినిమాలో గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన తమన్నా.. టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసనా ఆడిపాడింది. ప్రస్తుతం ఈ భామ ఎఫ్3, గుర్తుందా శీతాకాలం, గని చిత్రాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లు, టీవీ షోలు కూడా చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది.
ఇక మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తమన్నా.. ఎప్పటికప్పుడు తన అందాలతో మిస్మరైజ్ చేస్తుంటుంది. తాజాగా కూడా స్టైలిష్ డ్రెస్‌లో సూపర్ హాట్‌గా దర్శనమిచ్చింది. చెమటలు పట్టిస్తున్న తమన్నా తాజా ఫొటోలు నెట్టింట తెర వైరల్ అవుతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరూ వాటిపై ఓ లుక్కేసేయండి.