ఆ పని చేసి అడ్డంగా బుక్కైన రెజీనా..ఫైర‌వుతున్న నెటిజ‌న్లు!

రెజీనా కాసాండ్రా.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. `శివ మనసులో శృతి` సినిమాతో సినీ గ‌డ‌ప తొక్కిన రెజీనా.. కెరీర్‌లో భారీ హిట్ అందుకోలేక‌పోయినా త‌న‌దైన అందం, న‌ట‌న‌తో స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ భామపై నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Regina Cassandra spends time at organic farm near Mangaluru | The News Minute

అందుకు కార‌ణం ప్ర‌జ‌ల‌కు హాని చేసే ఆల్కహాల్‌ను ఆమె ప్ర‌మోట్ చేయ‌డ‌ట‌మే. అవును, రెజీనా సిగ్నేచర్ బ్రాండ్ ఆల్కహాల్‌ను ప్రమోట్ చేస్తూ అందుకు సంబంధించిన యాడ్‌లో న‌టించింది. ఈ యాడ్‌లో `నాకు తొమ్మిదేళ్లున్నప్పుడు యాంకరింగ్ మొదలుపెట్టాను. ఇప్పుడు కమర్షియల్ చిత్రాలు, ప్రకటనలు నటించే వరకు వచ్చాను.

Regina Cassandra and Nivetha Thomas in the Telugu remake of South Korean film Midnight Runners - EasternEye

ఇది నా ప్రయాణం. నాకు ఈ మూమెంట్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. దీన్ని నేను సిగ్నేచర్‌తో సెలెబ్రేట్ చేసుకుంటాను` అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ యాడ్ నెట్టింట వైర‌ల్ కావ‌డంతో.. రెజీనా అడ్డంగా బుక్కైంది. యాడ్ చూసిన నెటిజ‌న్లు రెజీనాపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. డ‌బ్బుల కోసం ప్ర‌జ‌ల‌కు హాని చేసే ఆల్కహాల్‌ను ప్రమోట్ చేస్తావా అంటూ రెజీనాను సోష‌ల్ మీడియా వేదిక‌గా తెగ ట్రోల్ చేస్తున్నారు.

https://www.instagram.com/p/CVPwOmiIVaR/?utm_source=ig_web_copy_link

Share post:

Latest