ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తున్న `వినాయ‌క‌చ‌వితి`..ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లు ఫైర్‌

ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాల‌ను `వినాయ‌క‌చ‌వితి` హీటెక్కించేస్తోంది. క‌రోనా థార్డ్ వేవ్ ముప్పు ఉంద‌న్న కార‌ణంగా వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లకే పరిమితం చేయాలని, మంటపాల ఏర్పాటుకు, నిమజ్జనాలకు అనుమతి లేద‌ని జ‌గ‌న్ స‌ర్కార్ ఆదేశాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. దాంతో వివాదం రాజుకుంది.

Cyclonic storm Yaas: Andhra CM Jagan discusses state's plan with Amit Shah | The News Minute

వినాయక చవితి వేడుకలపై ఆంక్షలు విధించడం స‌రికాదంటూ ప్ర‌భుత్వ తీరుపై హిందూ సంఘాలు మ‌రియు ప్ర‌జ‌లు ఫైర్ అవుతున్నారు. ఇటీవ‌ల సెప్టెంబర్ 2వ తేదీన పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి ని భారీ ఎత్తున నిర్వ‌హించారు. అయితే అప్పుడు గుర్తుకురాని క‌రోనా వినాయక చవితి ఉత్సవాలకు గుర్తొచ్చిందా అంటూ ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు.

Ganesh Chaturthi 2017: Eight places across India you must visit to see celebrations

ఈ క్ర‌మంలోనే కొంద‌రు రాజ‌కీయ నాయ‌కులు జ‌గ‌న్‌ను టార్గెట్ చేస్తూ విరుచుకుప‌డుతున్నారు. ముఖ్యంగా బీజేపీ నేత‌లు.. వైఎస్ జగన్ హిందూ వ్యతిరేకి కావడం వల్లనే హిందువులు అత్యంత పవిత్రంగా భావించే వినాయక చవితి వేడుకలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాడని.. రంజాన్, క్రిస్మస్, మొహర్రం పండుగలపై లేని ఆంక్షలు వినాయకచవితికి ఎందుకని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇక మ‌రోవైపు ప్ర‌భుత్వం విధించిన అక్షంన‌ల‌ను ప‌ట్టించుకోకుండా ప‌లు జిల్లాల్లో చ‌వితి ఉత్స‌వాల‌కు ఏర్పాట్లు చేసేసుకుంటున్నారు. మొత్తానికి వినాయ‌క‌చ‌వితి కార‌నంగా ఏపీ రాజ‌కీయాలు హాట్ హాట్ గా మ‌రిపోయాయి.