విడో పాత్రలో అలరించడానికి సిద్దం అవుతోన్న స్టార్ హీరోయిన్..!

September 22, 2021 at 2:30 pm

ఈ కాలంలో చాలా మంది స్టార్ హీరోయిన్లు కథ నచ్చితే పాత్రలు చేయడానికి వెనుకాడడం లేదు.. ఇక ఈ నేపథ్యంలోనే అలనాటి తార అందరినీ అలరించిన ముద్దుగుమ్మ టబు కూడా తనకు నచ్చిన ఒక పాత్ర చేయడానికి ముందుకు వచ్చింది. అది ఏమిటంటే మోడ్రన్ విడో పాత్రలో నటించడానికి సిద్ధమైంది స్టార్ హీరోయిన్ టబు..

ఇటీవల బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్న వైట్ సినిమాలో మోడ్రన్ విడో పాత్ర కోసం ఆయన టబు ను సంప్రదించినట్లు సమాచారం.. అలాగే పాత్ర నచ్చడంతో ఆమె వైవిధ్యంగా ఉండటం కోసం, ఈ పాత్ర చేయడానికి ఒప్పుకుందట. దాదాపు ఈ ఇద్దరి కాంబినేషన్ లో 21 సంవత్సరాల తర్వాత రాబోతున్న చిత్రం వైట్.. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చివరి సినిమా అస్తిత్వం ..ఇక ఈ సినిమా జాతీయ అవార్డును కూడా అందుకుంది.

ఇప్పుడు రాబోతున్న ఈ చిత్రం ఒక వితంతువును కేంద్ర బిందువుగా తీసుకొని, ఈ సినిమా మొత్తం నడుస్తోంది. ఇక కీలక పాత్ర పోషించడానికి టబు ఒప్పుకుందని.. ముఖ్యంగా నేటి సమాజంలో యువత విడో అయితే ఎలా ఉంటుంది ..? ఆమె ఎలాంటి సమస్యలను ఎదుర్కోబోతోంది..? అనే నేపథ్యంలో ఈ కథను తెరకెక్కిస్తున్నట్లు వినికిడి.

విడో పాత్రలో అలరించడానికి సిద్దం అవుతోన్న స్టార్ హీరోయిన్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts