శంకర్ బోయపాటిని మించిపోతాడా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తుండగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రంలో కూడా ఓ కీలక పాత్రలో చరణ్ నటిస్తున్నాడు. ఈ సినిమాలు రిలీజ్ కాకముందే చరణ్ ఇటీవల తన నెక్ట్స్ ప్రాజెక్టును స్టార్ట్ చేశాడు.

సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ ఓ పాన్ ఇండియా మూవీలో నటించేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు శంకర్ అండ్ టీమ్ రెడీ అవుతోంది. అయితే ఈ సినిమాలో పలు యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలోని ఓ ట్రెయిన్ ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాకే హైలైట్‌గా నిలవనుందట. అయితే ట్రెయిన్ యాక్షన్ సీక్వెన్స్ అనగానే మెగా ఫ్యాన్స్ భయపడుతున్నారట. దానికి కారణం మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను అని తెలుస్తోంది.

గతంలో ‘వినయ విధేయ రామ’ చిత్రంలో చరణ్ ఓ రైలుపై చేసిన యాక్షన్ సీన్ ఎలాంటి కామెడీ పీస్‌గా మిగిలిపోయిందో అందరికీ తెలిసిందే. అందుకే ట్రెయిన్ ఎపిసోడ్ కాకుండా వేరే ఏదైనా యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేస్తే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి నిజంగానే ట్రెయిన్ సీక్వెన్స్‌లో శంకర్ బోయపాటిని మించిపోతాడా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.