బిగ్‌బాస్ 5లో ఆ ఐదుగురికే భారీ రెమ్యూన‌రేష‌న్..ఇంత‌కీ ఎంతంటే?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 మ‌రొన్ని గంట‌ల్లో ప్రారంభం కాబోతోంది. సెప్టెంబ‌ర్ 5 ఆదివారం సాయంత్రం 6గంటలకు బిగ్ బాస్ కర్టైన్ రైస్ ఎపిసోడ్ గ్రాండ్‌గా ప్ర‌సారం కాబోతోంది. మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ క్వారంటైన్ పూర్తి చేసుకుని ఈ రోజే హౌస్‌లోకి వెళ్ల‌బోతున్నారు.

Nagarjuna opens up about Bigg Boss Telugu Season 5

హైస్‌లోకి వెళ్ల‌బోయే కంటెస్టెంట్స్ వీరే అంటూ ఇప్ప‌టికే చాలా లిస్ట్‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అయితే యాంక‌ర్ ర‌వి, నటరాజ్ మాస్టర్, అనీ మాస్టర్, శ్వేతా వర్మ, ఉమాదేవి, మానాస్, షణ్ముఖ్, వి.జె.సన్నీ, ప్రియాంక సింగ్, లోబో, శ్రీరామ్, ఆర్జే కాజల్, జశ్వంత్, విష్ణు ప్రియ‌, లహరి, సిరి హనుమంత్, సరయు పేర్లు బ‌లంగా వినిపిస్తున్నాయి.

Bigg Boss Contestants : బిగ్‌బాస్ సీజ‌న్‌ 5 తెలుగు కంటెస్టెంట్స్ లిస్ట్? | Bigg Boss Season 5 Telugu Contestants List?

ఇక మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. వీరిలో యాంక‌ర్ ర‌వి, కార్తీకదీపం ఫేమ్ ఉమాదేవి, అనీ మాస్టర్, షణ్ముఖ్ జశ్వంత్, సీనియర్ ఆర్టిస్ట్ ప్రియ ఈ ఐదుగురికి భారీ రెమ్యూన‌రేష‌న్ ఇస్తున్నార‌ట బిగ్‌బాస్ నిర్వాహ‌కులు. వీరంద‌రూ రోజుకు రూ. 40 వేలకు పైగా పుచ్చుకుంటున్నార‌ని తెలుస్తోంది. హౌస్‌లో ఈ ఐదుగురిదే అత్య‌ధిక రెమ్యూన‌రేష‌న్ అని టాక్‌.

 

Share post:

Popular