అవకాశం కావాలి అనుకుంటే పక్కలోకి రా అంటూ హీరోయిన్ ని డిమాండ్ చేసిన దర్శకుడు?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ లు కాస్టింగ్ కౌచ్ విషయంలో చాలా రకాలుగా సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ ఈ కాస్టింగ్ కౌచ్ ఇది కొనసాగుతూనే ఉంది. ఇప్పటికి ఎంతో మంది హీరోయిన్లు కాస్టింగ్ కౌచ్ విషయంలో నోరు మెదిపారు. ఇంకా కొంత మంది హీరోయిన్లు ఇలాంటి విషయాలను చెప్పుకోవడానికి భయపడుతుంటారు. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా ఒక హీరోయిన్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన జీవితంలో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి పంచుకుంది.

ఈ సందర్భంగా హీరోయిన్ మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీ కి అడుగు పెట్టిన రోజే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపింది. అంతేకాకుండా తాను ఇండస్ట్రీకి రాకముందు ఇండస్ట్రీ గురించి చాలా పాజిటివ్ గా అనుకున్నానని, కానీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత అసలు రూపం బయటపడింది అంటూ ఆమె చెప్పుకొచ్చింది. తాను ఒక సినిమాలో అవకాశం అందుకోగా అందులో తాను చాలా చిన్న పాత్ర అనుకుని వెంటనే డైరెక్టర్ వద్దకు వెళ్లి పెద్ద క్యారెక్టర్ ఉంటే ఇవ్వండి అని అడగగా, ఆ డైరెక్టర్ నీకు పెద్ద అవకాశం కావాలి అంటే పక్కలోకి రావాల్సిందే అని డిమాండ్ చేశాడట. దీంతో ఆమె చిన్న పాత్రను కూడా వదులుకొని మరో మంచి అవకాశం కోసం ఎదురు చూశాను అంటూ చెప్పుకొచ్చింది.

Share post:

Popular