త్వరలో ఎన్టీఆర్ 30వ సినిమా షూటింగ్ షురూ..!

ఎన్టీఆర్ RRR ఈ సినిమా తర్వాత కొరటాల శివ డైరెక్షన్లో ఒక సినిమాను చేయబోతున్నట్లు సమాచారం.కానీ ఆ సినిమా కొన్ని కారణాల చేత ఆలస్యమవుతుంది. ఎన్టీఆర్ మరియు కొరటాల కాంబోలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ఎప్పుడు ఎప్పుడు మొదలవుతుంది అని నందమూరి అభిమానలు ఎదురుచూస్తున్నారు.

ఇక డైరెక్టర్ కొరటాల శివ ఆచార్య సినిమాను కూడా దాదాపుగా పూర్తి చేసినట్లు సమాచారం.ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే.ఇక ప్రస్తుత సినిమా కూడా అంతే ఘన విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు ఎన్టీఆర్ అభిమానులు.ఇక ఈ సినిమాలో డైరెక్టర్ కొరటాల శివ ఎన్టీఆర్ తగ్గట్టుగా కథ రాసుకున్నట్లు సమాచారం,ఇక ఈ సినిమాతో సమాజంలో ఒక మంచి మెసేజ్ ని ఇస్తూ.. అందుకు తగ్గట్టుగా ఎంటర్టైన్మెంట్ కూడా ఉండేలా సినిమాలో ప్లాన్ చేస్తున్నట్లుగా సినీ ఇండస్ట్రీలో వినిపిస్తుంది.

Koratala Siva makes BIG announcement with Junior NTR, reveals release date  of his next

ఎన్టీఆర్ 30 వ సినిమా కోసం కొరటాల శివ బాగా శ్రద్ధ పెట్టి తీస్తున్నట్లు గా తెలుస్తోంది.దాదాపు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి అయినట్లు సమాచారం.ఈ సినిమాను వచ్చే వారం అధికారికంగా ప్రకటింబో తున్నట్లు గా సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వాని లేదా పూజా హెగ్డే ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం పై త్వరలోనే స్పష్టత వస్తుందేమో చూడాలి.