తెలంగాణ లో చోటు చేసుకున్న మరో దారుణం..!

ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినప్పటికీ ఆకతాయిల ఆగడాలు ఆగడం లేదనే చెప్పాలి.. మహిళలపై, బాలికలపై అత్యాచారాలు చేస్తూ ఎంతో మంది ఆడ పిల్లల జీవితాలను ఈ మానవ మృగాలు బలి తీసుకుంటున్నారు.. ఇక ఇప్పటికీ సింగరేణి కాలనీ లో ఆరు సంవత్సరాల చిన్నారి చైత్ర పై జరిగిన అత్యాచారం ఘటన మరవకముందే ఇప్పుడు మరోసారి తెలంగాణలో మరో దారుణం చోటుచేసుకుంది.

- Advertisement -

పూర్తి వివరాల్లోకి వెళితే .. తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లా లో నలుగురు యువకులు ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిజామాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మంగళవారం అర్ధరాత్రి ఈ దారుణం చోటు చేసుకోవడం ఆసుపత్రి వర్గాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి.. యువతి అరుపులు కేకలు విన్న సెక్యూరిటీ సిబ్బంది గదిలోకి వెళ్లి చూశారు. ఆమెపై అత్యాచారం జరిగిందని గుర్తించి వెంటనే డయల్‌ 100కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాధితురాలు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. యువతికి బలవంతంగా మద్యం తాగించి దుండగులు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారని చిత్రాలు చెప్పడంతో వారి కోసం గాలిస్తున్నారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన నిజామాబాద్‌లో దుమారం రేపుతోంది. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Share post:

Popular