ఆలీ బేరం ఆడడంతో దూరం పెట్టిన మోహన్ బాబు..!

ఆలీ ఇటీవల ఈటీవీలో ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా అనే ఒక షోకి.. హోస్ట్ గా వ్యవహరిస్తూ ఎంతో మంది సినీ ప్రముఖులను ఆహ్వానించి.. వారి ద్వారా వారి వ్యక్తిగత జీవితాలను ప్రేక్షకులకు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆలీ ఎంతో సక్సెస్ ఫుల్ గా 249 ఎపిసోడ్ లను పూర్తి చేసుకున్నాడు.ఇక 250 ఎపిసోడ్ స్పెషల్ గెస్ట్ గా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ను ఆహ్వానించడం జరిగింది.

ఆ నటుడికి పొగరు ఎక్కువైందన్న మోహన్ బాబు.. అసలేం జరిగిందంటే

ఈ షోలో ఆయన తన జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు..ఈ సందర్భంగా ఆలీ గురించి మోహన్ బాబు మాట్లాడుతూ.. నేను నటించిన సినిమాలతో పాటు నేను నిర్మాతగా వ్యవహరించిన సినిమాలలో కూడా కామెడీతో పాటు విలన్ పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను.ఇక అందులో భాగంగానే ఆలీని కూడా నా సినిమాలలో పెట్టుకోవడం జరిగింది.. కానీ ఆలీ కి క్రేజ్ పెరగడంతో పొగరు కూడా బాగా పెరిగింది.. ఈ నేపథ్యంలోనే ఆలీ నేను నిర్మాత గా ఉన్నప్పుడు డబ్బులు బాగా డిమాండ్ చేశాడు.. ఇక అలా ఆలీకి ఉన్న పొగరు కారణంగా అలా నా సినిమాల నుండి తీసేసాను అని తెలిపాడు మోహన్ బాబు..

ఇక ఆ తర్వాత మరికొన్ని మాటలతో షో మొత్తం సందడిగా కొనసాగింది.