తాలిబన్లు సంచ‌ల‌న నిర్ణయం.. ఐపీఎల్ కు బిగ్ షాకే త‌గిలిందిగా!

బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ కు ప్ర‌పంచవ్యాప్తంగా ఎంద‌రో అభిమానులు ఉన్నారు. అయితే కరోనా మ‌హ‌మ్మారి కారణంగా ఆగిపోయిన‌ ఐపీఎల్ 2021 సీజన్ రెండో భాగం.. సెప్టెంబ‌ర్ 19 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభ‌మైంది. ఈసారి స్టేడియంలోకి ప‌రిమిత సంఖ్య‌లో ప్రేక్షకులను కూడా అనుమతి ఇవ్వ‌డంతో.. ఆట‌గాళ్ల‌కు మ‌రింత కిక్ వ‌చ్చింది.

ప్ర‌స్తుతం జోరుగా ఐపీఎల్ మ్యాచులు జ‌రుగుతున్నాయి. అయితే ఇలాంటి త‌రుణంలో బిసీసీఐకు అఫ్గానిస్తాన్‌లో అధికారం చేపట్టిన తాలిబన్స్ బిగ్ షాక్ ఇచ్చారు. ఐపీఎల్ ను తమ దేశంలో ప్రసారం చేయవద్దంటూ తాలిబన్లు మీడియా సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి వారు చెప్పిన కారణం మరీ విడ్డూరంగా ఉండటం గమనార్హం.

క్రికెట్ మ్యాచ్‌ల ప్రసార సమయంలో వచ్చే యాడ్స్, మైదానంలో ఆడవాళ్ల డ్యాన్సులు వంటివి ముస్లిం మత విధానాలకు విరుద్దమని.. వాటిని చూడటం వల్ల మనసులో చెడు భావాలు వస్తాయనే ఉద్దేశంతోనే టీవీ, మొబైల్స్‌లో ఐపీఎల్ ప్రసారాలను బ్యాన్ చేస్తున్నట్టు తెలిపారు. ఇక తాలిబన్స్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల బీసీసీఐకి భారీగా నష్టం వాటిల్లనుంది.

Share post:

Latest