బిగ్‌బాస్‌-5: స‌న్నీని క‌త్తుల‌తో పొడుస్తున్న‌ హౌస్‌మేట్స్‌..అస‌లేమైందంటే?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో నాలుగో వారం కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమాదేవి, ల‌హ‌రి ఎలిమినేట్ అవ్వ‌గా.. మిగిలిన హౌస్ మేట్స్ కెప్టెన్ అయ్యేందుకు ఈ వారం తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే క‌డుపును మాడ్చుకుని మ‌రీ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌ల‌ను ఆడుతున్నారు.

BB 5 Updates: ఆటతో అలరించి.. మాటలతో మురిపించిన సన్నీ - మానస్ | Bigg Boss 5  Telugu 29th September 2021 Episode Highlights | Bigg Boss 5 Updates

అయితే తాజాగా ఈ రోజు ప్ర‌సారం కాబోయే ఎపిసోడ్ ప్రోమోను విడుద‌ల చేశారు. ఈ ప్రోమో బ‌ట్టీ చూస్తుంటే.. కెప్టెన్ అయ్యేందుకు సన్నీ, శ్వేత, శ్రీరామ్ లు పోటీకి దిగిన‌ట్టు అర్థం అవుతోంది. ఇక వీరికి బిగ్ బాస్ `కత్తులతో సహవాసం` అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో ఎవరు కెప్టెన్సీకి అనర్హులో వివరంగా రీజన్ చెప్పి.. వారి నడుముకు కట్టిన బెల్త్‌పై కత్తులు పొడవాలంటూ మిగతా కంటెస్టెంట్లకు బిగ్ బాస్ సూచనలు ఇచ్చాడు.

VJ Sunny Bigg Boss Fame: Age, Height & Family- CelebSecrets.in

దాంతో ఇంటి స‌భ్యుల్లో చాలా మంది స‌న్నీనే క‌త్తుల‌తో పొడిచారు. తన మిత్రులు అనుకున్నవారు కూడా క‌త్తుల‌తో పొడ‌వ‌డంతో.. స‌న్నీ ఎంతో ఫీల్ అయిపోయాడు. అయితే ప్రోమో చూసిన నెటిజ‌న్లు మాత్రం.. ఎంత మంది స‌న్నీని పొడిచినా త‌మ మ‌ద్ధ‌తు ఆయ‌న‌కే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి స‌న్నీ హౌస్‌లో ఒంట‌రి అయినా.. బ‌య‌ట‌కు మాత్రం ఫుల్ ఫాలోయింగ్‌ను పెంచేసుకుంటున్నాడు.

Share post:

Latest