బిగ్‌బాస్‌-5: అంద‌రినీ వెన‌క్కి నెట్టిన అల్ల‌రి పిల్ల‌.. ఫ‌స్ట్ వీక్ కెప్టెన్ ఆమెనే..?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 ఇటీవ‌లె ప్రారంభం అయిన సంగ‌తి తెల‌సిందే. షో స్టార్ట్ అయిన రెండో రోజుల‌కే రంజుగా మార‌గా.. తొలి వారం యాంకర్ రవి, హమీద, జస్వంత్ పడాల, ఆర్జే కాజల్, మానస్, సరయులు నామినేట్ అయ్యాయి. మ‌రోవైపు కొత్తగా పవర్ రూం కాన్సెప్ట్‌ తెరపైకి తీసుకొచ్చిన బిగ్ బాస్.. కెప్టెన్సీ కోసం పోటీపడే కంటెస్టెంట్లను ఎంపిక చేసేందుకు ఇప్పటికే శక్తి చూపరా డింభకా అనే టాస్క్‌ ఇచ్చాడు.

Bigg Boss Telugu Season 5 Episode 3 Highlights

ఇందులో విజేతగా నిలిచి కెప్టెన్ పోటీదారులుగా నిలవడం కోసం కంటెస్టెంట్లు నానా తిప్పలు ప‌డ‌గా.. చివ‌ర‌కు విశ్వ, మానస్‌, సిరి, హమీదా కెప్టెన్సీ టాస్క్‌కు ఎంపిక అయ్యారు. వీరికి బిగ్‌బాస్‌ సైకిల్‌ తొక్కే టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో మిగతా కంటెస్టెంట్లు తమకు నచ్చినవారికి సపోర్ట్‌ చేస్తూనే అవతలివాళ్లు టాస్క్‌ గెలవకుండా ఆటంకం కలిగించ‌వ‌చ్చు.

Bigg Boss 5 Telugu Exclusive: This contenstant to become the captain of the house?

అయితే తొలి కెప్టెన్‌గా చరిత్ర సృష్టించేందుకు ఆ నాలుగురూ తీవ్రంగా శ్రమించిన‌ట్టు తెలుస్తుండ‌గా.. లాస్ట్‌కు అంద‌రినీ వెన‌క్కి నెట్టి అల్ల‌రి పిల్ల సిరి ఫ‌స్ట్ వీక్ కెప్టెన్ అయిన‌ట్టు లీకుల వీరుల స‌మాచారం ద్వారా తెలిసింది. అంతేకాదు, సిరి విశ్వను రేషన్‌ మేనేజర్‌గా ఎంపిక చేసుకున్నట్లు స‌మాచారం.