సమంతపై అలాంటి కామెంట్లు చేసిన శ్రద్ధ.. అసలు నిజం?

టాలీవుడ్ బ్యూటీ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సమంతా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అంతేకాకుండా ఈమె బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నట్లు  వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇది ఇలా ఉంటే సమంతపై అలాంటి శ్రద్ధ శ్రీనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటి శ్రద్ధ చేసిన వ్యాఖ్యలపై సమంత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే శ్రద్ధా శ్రీనాథ్ సమంతా పై ఎటువంటి వ్యాఖ్యలు చేసింది. సమంత అభిమానులు ఆమెపై ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? పూర్తి వివరాల్లోకి వెళితే ..

ఒక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నటి శ్రద్ధా శ్రీనాథ్ యూటర్న్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ నేను చాలా పొసెసివ్. రచన పాత్రలు ఎవరిని ఊహించుకోలేను. అలాగే యూటర్న్ సినిమాను నేను కేవలం అరగంట కూడా చూడలేకపోయాను. సినిమా మొత్తం ఒకసారి చూడటానికి ప్రయత్నిస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈమె వ్యాఖ్యలపై సమంత అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నటి శ్రద్ధా కంటే సమంత సీనియర్ అయినప్పటికీ ఎలా మాట్లాడాలో తెలియకుండా మాట్లాడటం మంచిది కాదని అప్పట్లో శ్రద్ధా పై సమంత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Share post:

Latest