సైలెంట్ గా వచ్చి అదరకొడుతున్న శివ కార్తికేయన్ డాక్టర్ ట్రైలర్..!

తమిళంలోనూ ఇటు తెలుగులోనూ నటుడు శివకార్తికేయన్ హీరోగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈయన నటించిన కొన్ని సినిమాలు తెలుగులోకి అనువాదమై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి.ఇదే తరుణంలో శివ కార్తికేయన్ ప్రస్తుతం”డాక్టర్”అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కు సంబంధించి ఒక ట్రైలర్ కొద్ది నిమిషాల ముందు విడుదలైంది. ఈ టైలర్ విశేషాలను చూద్దాం.

Doctor Trailer: Sivakarthikeyan's Film on Human Trafficking Promises a  Thrilling Ride! (Watch Video)

డైరెక్టర్ నిల్సాన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో.. శివ కార్తికేయన్ నటిస్తున్న ప్రస్తుత క్రైమ్ థ్రిల్లర్ మూవీ డాక్టర్. ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్, యోగిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్నప్పటికీ కరోనా కారణంగా ఈ సినిమా వాయిదాల పడుతూ వస్తోంది.అక్టోబర్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

Watch: Trailer of Sivakarthikeyan's Doctor promises a tense thriller | The  News Minute

ఈ సినిమాను “వరుణ్ డాక్టర్”పేరుతో తెలుగులోకి విడుదల చేయనున్నారు. సినిమా ట్రైలర్ విషయానికి వస్తే వరుసగా జరుగుతున్న అమ్మాయిల కిడ్నాప్ లను అడ్డుకునేందుకు ఒక డాక్టరు ఏం చేస్తాడు అనే కథతో తెరకెక్కించ బడినట్లు తెలుస్తోంది.ఈ డాక్టర్ అమ్మాయిలను కాపాడేందుకు ఎవరి సహాయం తీసుకుంటాడు అమ్మాయిలను కిడ్నాప్ చేసే ముఠాను ఎలా అరికడతాడు అనే విషయం తెలియాలంటే వెండితెరపై చూడాల్సిందే.

Share post:

Latest