సాయి ధరమ్ తేజ్ పై సంచలన కామెంట్స్ చేసిన బాబు మోహన్..!

టాలీవుడ్ లో అలనాటి కమెడియన్ బాబు మోహన్ ప్రతి ఒక్కరికి తెలిసిందే.ఇక ఈయన కోట శ్రీనివాసరావు కలిసి కామెడీ చేసి కడుపుబ్బా నవ్విస్తూ ఉంటారు.ఇక సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన విషయం అందరికీ తెలిసిందే.ఇక ఈయన ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఇక ఈ ప్రమాదం పై పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.

- Advertisement -

 

తాజాగా ఇదే విషయం పై నటుడు బాబు మోహన్ అందిస్తూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా తన కుమారుడు మరణాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.బాబు మోహన్ కుమారుడు కూడా ఇలానే స్పోర్ట్స్ బైక్ డ్రైవ్ చేస్తు ప్రమాదంలో మరణించిన సంగతి మనకు తెలిసిందే.

యాక్సిడెంట్ లో తన కుమారుడి మరణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పారు.సరదా కోసం ప్రాణాలతో ఎవరు చెలగాటమాడుకోవద్దని బాబు మోహన్ చెప్పుకొచ్చారు.వాళ్లు మరణించినవారు పోతారు కానీ.. వారీ ని పెంచిన వారు మాత్రం నిత్యం మానసిక క్షోభను అనుభవిస్తూ ఉంటారని..అందుకోసమే బండి నడిపే వారుఒక్కసారి ఆలోచించాలని బాబుమోహన్ తెలియజేశారు.

ఇక సాయి ధరమ్ తేజ్ హెల్మెట్ పెట్టుకొని మంచి పని చేశాడని బాబుమోహన్ తెలియజేశారు.ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకు వచ్చినప్పుడు కంపల్సరిగా హెల్మెట్ పెట్టుకుని బైకు నడపండి అంటూ వేడుకుంటున్నాడు. దయచేసి యూత్ కుటుంబాన్ని గుర్తుపెట్టుకుని బైక్ నడపాలని అంటూ బాబు మోహన్ ఎమోషనల్ అయ్యారు.

Share post:

Popular