సాయి ధరమ్ తేజ్ కోసం రాశిఖన్నా జయప్రద:ఫొటోలు వైరల్?

గత రెండు రోజులుగా ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ విషయమే వినిపిస్తోంది. సాయి ధరమ్ తేజ్ రోడ్డుపై ప్రయాణిస్తుండగా అదుపుతప్పి ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో తీవ్ర గాయాలు అవ్వడంతో వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ విషయం తెలియగానే కుటుంబ సభ్యులు అలాగే కొన్ని పలువురు సినీ సెలబ్రిటీలు కూడా పెద్దఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. అంతేకాకుండా సాయి తేజ్ అభిమానులు కూడా అపోలో హాస్పటల్ వద్దకు చేరుకున్నారు.

ఈ నేపథ్యంలోనే సాయి ధరమ్ తేజ్ కోసం హీరో రాశి ఖన్నా, అలాగే జయప్రద కూడా అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. తేజ్ ఆరోగ్యం విషయంపై అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత సాయి తేజ్ కుటుంబ సభ్యులతో కాసేపు గడిపారు. అయితే సాయి తేజ్ ను పరిశీలించిన డాక్టర్లు అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎటువంటి ప్రమాదం లేదని తెలిపారు. అలాగే ఇంటర్నల్ గా ఎటువంటి గాయాలు లేవని తేల్చి చెప్పారు.