నానితో ఎక్కువ‌ టైమ్ గ‌డిపా.. అదే ఆయ‌న‌లో న‌చ్చింది: రీతూ వర్మ

న్యాచుర‌ల్ స్టార్ నాని, రీతూ వ‌ర్మ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `టక్‌ జగదీష్‌`. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ అండ్ యాక్ష‌న్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. ఈ సంద‌ర్భంగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న రీతూ వ‌ర్మ‌.. ఎన్నో విష‌యాలు షేర్ చేసుకుంది.

Tuck Jagadish Movie Release: Nani, Ritu Varma and Aishwarya Rajesh starrer Tuck Jagadish to release in theatres: Makers clarify

ఈ క్ర‌మంలోనే నాని గురించి మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. రీతూ మాట్లాడుతూ.. నానితో ఇది రెండో సారి నటించడం. మొదట ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నటించిన‌ప్ప‌టికీ..అందులో నాది చిన్న పాత్ర. కానీ ఈ సారి మాత్రం నానితో ఎక్కువ సమయం గ‌డిపాను. ఆయ‌న నుంచి ఎంతో నేర్చుకున్నాను. అయనెంతో సపోర్ట్ చేశారు.

Tuck Jagadish (2021)

నాని సెల్ప్ మేడ్ స్టార్. ఆయన గ్రాఫ్ అలా పెరుగుతూనే వస్తోంది. ప్రతీ సినిమాతో ప్రేక్షకుడికి ఏదో ఒక కొత్త ఫీలింగ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. నానిలో నచ్చిన విషయం అదే. అలాగే నాని నటన అంటే ఇష్టం, ఆయన ఎంచుకునే కథలు ఇష్టం. మరోసారి ఆయనతో కలిసి నటించాలని ఉంది` అంటూ చెప్పుకొచ్చింది. మ‌రి వీరిద్ద‌రి కాంబోలో మ‌రో సినిమా వ‌స్తుందో లేదో చూడాలి.

 

Share post:

Popular