రవితేజ సినిమాను వదులుకున్న స్టార్ హీరోస్ వీళ్లే..!

హీరో రవితేజ సినిమా ఇండస్ట్రీలో కి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టాడు. మొదట ఈ హీరోగా చిన్న చిన్న పాత్రలు వేస్తూ వచ్చాడు. ఆతర్వాత సినిమా హీరోగా ఎదిగాడు. ఇక గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో రవితేజ హీరోగా వచ్చిన చిత్రం డాన్ శీను. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమాను వదులుకున్న కొంత మంది స్టార్స్ గురించి తెలుసుకుందాం.

ఈ చిత్రంలో శ్రీహరి నటన ఎంతో అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక డాన్ శీను సినిమాని మొదట హీరో ప్రభాస్ కు వినిపించారట. కానీ ఆ స్టోరీ లైన్ విన్న ప్రభాస్ చేద్దాం అని చెప్పి, కొన్ని కారణాల చేత ఈ సినిమాని వదులుకోవాల్సి వచ్చింది. ఇక హీరో గోపీచంద్ కీ కూడా ఈ సినిమా స్టోరీ వినిపించగా కథ బాగుంది అని తెలియజేశాడట. కానీ అప్పటికే తన సినిమా డేట్స్ ఖాళీగా లేకపోవడంతో ఈ సినిమాను వదిలిపెట్టడం జరిగింది.Prime Video: Don Seenu

ఇక నిర్మాత దిల్ రాజుకు ఈ కథ చెప్పగా..ఈ కథకి హీరో రవితేజ అయితే బాగా సెట్ అవుతాడని చెప్పి ఈ సినిమాను ఆయనతో ఒప్పించి చేయించడం జరిగింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం తో పాటు కలెక్షన్ల వర్షం కురిపించింది.

Share post:

Latest