కొత్త అవ‌తారం ఎత్త‌బోతున్న రానా..స‌క్సెస్ అవుతాడా?

ద‌గ్గుబాటి రానా కొత్త అవ‌తారం ఎత్త‌బోతున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న విల‌క్ష‌ణ‌మైన న‌ట‌న‌తో మంచి న‌టుడిగా స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రానా.. ఇప్పుడు గాయ‌కుడిగా మార‌బోతున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. రానా దగ్గుబాటి, సాయిపల్లవి ప్రధాన పాత్రలో నక్సల్ బ్యాగ్రౌండ్‌లో వస్తోన్న తాజా చిత్రం విరాటపర్వం.

Rana Daggubati and Sai Pallavi share poster of Virata Parvam, set for a  summer release

వేణు ఊడుగుల దర్శకత్వం వ‌హిస్తోన్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. అయితే ఈ చిత్రంలో ఆలోచన రేకెత్తించే ఓ విప్లవ గీతానికి రానా వాయిస్‌ బాగుంటుందని దర్శకుడికి అనిపించిందట. ఇందులో భాగంగానే ఆ ప్రత్యేకగీతాన్ని ఆలపించమని రానాని కోర‌గా.. అందుకు వెంట‌నే ఆయ‌న ఓకే చెప్పేశార‌ట‌.

Virata Parvam (2021) - IMDb

మ‌రో వారం రోజుల్లోనే ఆ పాట రికార్డింగ్ కూడా చేయ‌బోతున్నార‌ట‌. మ‌రి తొలిసారిగా గీతాలాపన చేయ‌బోతున్న రానా ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతాడో చూడాలి. కాగా, ఈ చిత్రానికి సురేష్‌ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. అలాగే సురేష్ బాబుతో పాటు సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.