రమ్యకృష్ణ రోజుకు రెమ్యునరేషన్ అన్ని లక్షలు తీసుకుంటుందా..?

తెలుగు సినిమా పరిశ్రమలో చాలా కాలం వరకు అగ్రహీరోయిన్ గా రాణించింది రమ్యకృష్ణ. సినీ ఇండస్ట్రీలోకి “భలే మిత్రులు”సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈమే. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఒక ఇమేజ్ ను సంపాదించుకుంది. ఈమె ఒకానొక సమయంలో అవకాశాలు రాలేకపోవడంతో ఈమె చాలా డిప్రెషన్ కు గురైందట.

అలాంటి సమయంలో దర్శకుడు రాఘవేంద్రరావు.. డైరెక్షన్ లో”అల్లుడుగారు”సినిమా తో మరి ఆమె తన స్టార్ డం ను తిరిగి తెచ్చుకుంది. ఆ తరువాత ఈమె ఎన్నో సినిమాలలో నటించి టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఈమె తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక నరసింహ సినిమాలో చేసిన నీలాంబరి పాత్ర ఈమె జీవితంలో మర్చిపోలేనని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం రమ్యకృష్ణ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కీలక పాత్రలో నటిస్తున్న సినిమాలో ఈమె రోజుకు 10 లక్షల రూపాయల చొప్పున పారితోషికాన్ని అందుకున్నట్లుగా సమాచారం. ఇక ఈమె అంత తీసుకోవడం వల్ల ఈమె క్రేజ్ ఎంత స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవాల్సిందే. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ సినిమాలో నటిస్తోంది.

Share post:

Latest