రాజ‌మౌళి, కొర‌టాల‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న ఎన్టీఆర్‌..ఏమైందంటే?

ఓవైపు వ‌రుస సినిమాల‌తో బిజీగా గ‌డుపుతున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మ‌రోవైపు `ఎవరు మీలో కోటీశ్వరులు` అనే రియాలిటీ గేమ్ షోతో బుల్లితెరపై సైతం సంద‌డి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ షో ద్వారా త‌న‌దైన మాట‌తీరుతో కంటెస్టెంట్స్‌ను, ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటూ వారికి బాగా చేరువ‌వుతున్నాడు. ఎన్టీఆర్‌.

Evaru Meelo Koteeswarulu | NTR | Coming soon on Gemini TV - YouTube

ఇదిలా ఉంటే.. ఈ షో స్టార్టింగ్ ఎపిసోడ్‌లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ వ‌చ్చి సంద‌డి చేయ‌గా.. ఇక ఇప్పుడు టాలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కులు రాజ‌మౌళి, కొర‌టాల శివలు ఈ గేమ్ షోలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను కూడా జెమినీ టీవీ వారు విడుద‌ల చేశారు.

SS Rajamouli and Koratala Siva thank AP CM Jagan

ఈ ప్రోమోలో ఎన్టీఆర్.. `ఇక్క‌డ నేనే బాస్‌, నేను చెప్పింది వినాలి` అంటూ రాజ‌మౌళి, కొర‌టాలను గ‌డ‌గ‌డ‌లాడిస్తూ క‌నిపించాడు. మొత్తానికి ఆక‌ట్టుకుంటున్న ఈ ప్రోమో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇక ఈ ప్రోమో సంబంధించిన ఎపిసోడ్ సెప్టెంబర్ 20 సోమవారం నాడు ప్రాసారం కానుంది. కాగా, ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్` చేస్తున్న ఎన్టీఆర్‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని కొర‌టాల శివ‌తో ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

Share post:

Latest