ఆ స్టార్ హీరో భార్యకు ప్ర‌భాస్ సూప‌ర్ ట్రీట్‌..ఖుషీ అయిన హీరోయిన్‌!

పాన్ ఇండియా స్థార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్నాడు. సినిమా విష‌యం ప‌క్క‌న పెడితే.. ప్ర‌భాస్ మంచి ఫుడ్ ల‌వ‌ర్‌. ర‌క‌ర‌కాల వంట‌ల‌ను తాను తిన‌డ‌మే కాదు.. త‌న చుట్టూ ఉన్న వారికి సైతం పెడుతుంటారు. ముఖ్యంగా సెట్‌లో ప్రభాస్‌ ఉన్నారంటే ఇక యూనిట్‌ సభ్యులందరికీ పండుగే.

Prabhas bonds with Saif Ali Khan, Kareena Kapoor; Baahubali treats them  with biryani (See Picture)

ఎప్ప‌టిక‌ప్పుడు షూటింగ్‌లో ఉన్న వారంద‌రికీ వెరైటీ వంట‌కాలను వండించి రుచి చూపిస్తుంటారాయ‌న‌. అంతేకాదు, కొంద‌రు సెల‌బ్రెటీల‌కు టెస్టీ ఫుడ్‌ ఐటెమ్స్‌ను పార్శిల్స్‌ రూపంలోనూ పంపుతుంటారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ భార్య‌, స్టార్ హీరోయిన్ క‌రీనా క‌పూర్‌కు కూడా ప్ర‌భాస్ సూప‌ర్ ట్రీట్ ఇచ్చాడు.

The fame of 'Bahubali' Prabhas sent a special biryani to Kareena Kapoor  Khan, the actress shared the picture

హైద‌రాబాద్ స్పెష‌ల్ ద‌మ్ బిర్యానీని పార్శిల్ రూపంలో క‌రీనా క‌పూర్‌కు పంపించారు. దాంతో ఫుల్ ఖుషీ అయిన‌ క‌రీనా.. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా తెలిపింది. ఇది బాహుబ‌లి పంపిన బిర్యాని.. తిందాం.. అంటూ ఫొటోను షేర్ చేయ‌డ‌మే కాకుండా ప్ర‌భాస్‌కు ప్ర‌త్యేకంగా థాంక్స్ చెప్పింది. కాగా.. ప్ర‌భాస్‌, సైఫ్ ఆలీఖాన్ `ఆదిపురుష్‌` చిత్రంలో క‌లిసి న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్న ఈ మూవీలో ప్ర‌భాస్ రాముడిగా, సైఫ్ రావ‌ణాసురుడిగా క‌నిపించ‌బోతున్నారు.

Share post:

Latest